ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 15 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. లక్నోలోని అలీగంజ్ ఏరియాలో ఉన్న ఆ మూడు అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్ పేరుతో ఉన్న ఆ భవనంలో కమర్షియల్ స్పేస్‌ను ఎలా నిర్మించాలని అధికారులు ఆరా తీస్తున్నారు. లక్నో మున్సిపల్ అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్మయ్యారు. వాస్తవానికి ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని 2016లో ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని నిర్మాణంగా భావిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చారు. కానీ రెండు నెలల్లోనే మళ్లీ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అలీగంజ్ బిల్డింగ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎల్‌డీఏ వైస్ చైర్మెన్ ప్రథమేశ్ కుమార్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల దర్యాప్తు చేపట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ బిల్డింగ్‌లో ఉన్న యానిమేషన్ సెంటర్‌లో కోర్సులు నేర్చుకునేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇవాళ ఉదయం ఆ ప్రదేశానికి చేరుకున్నది. సీఎం యోగి ఆదేశాల మేరకు సిట్ బృందం దర్యాప్తు చేపడుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చెందిన ఆరు మంది సిబ్బంది ఇవాళ ఆ బిల్డింగ్ వద్ద ఆధారాలు సేకరించారు. అగ్నిప్రమాదం దేని వల్ల జరిగిందో, బాధ్యులు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
0 Comments