కల్కి సినిమా టికెట్ ధరలు పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !
క ల్కి సినిమా టిక్కెట్ ధరలను పెంచేసారు. కల్కి సినిమా ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27 నుంచి జూలై 4 వరకు మొత్తం ఎనిమిది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 వరకు పెంచుకోవచ్చని వివరించింది. వీటితోపాటు జూన్ 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వారం రోజులపాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.