Posts

Showing posts with the label ఈ ఆమోదం కోసం సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది

మనుషుల మెదడుపై ఇంప్లాట్స్‌ టెస్ట్‌కు న్యూరాలింక్ కంపెనీకి అనుమతులు !

Image
మెదడుకు సంబంధించిన వ్యాధులను సమర్థంగా నయం చేసేందుకు బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని ఎలాన్‌ మస్క్‌ కంపెనీ న్యూరాలింక్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యూరాలింక్ తన మొదటి హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్ కోసం యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందింది. దీంతో మానవులపై న్యూరాలింక్‌ బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని టెస్ట్‌ చేయడానికి రూట్ క్లియర్‌ అయింది. న్యూరాలింక్‌ కంపెనీకి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే గతంలో ఈ ఆమోదం కోసం సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చాలా మందికి సహాయం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన మొదటి అడుగు అని న్యూరాలింక్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదంపై ఆనందం వ్యక్తం చేసింది. అయితే రిక్రూట్‌మెంట్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి, అధ్యయనం గురించి నిర్దిష్ట వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరింత సమాచారం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బ్రెయిన్‌ ఇంప్లాంట్స్‌ వివిధ కండిషన్లను అడ్రస్‌ చేయగలవని, వెబ్ బ్రౌజింగ్, టెలిపతి వంటి ఫంక్షన్స్‌ను ఎనేబుల్‌ చేయగలవని ఎలాన్‌ మస్క్ గతంలో పేర్కొన్నారు. ఆయన డివైజెస్‌ సేఫ్టీపై విశ్వాసం వ్యక్తం చేశ...