Posts

Showing posts with the label petrol

మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ విడుదల

Image
దే శీయ మార్కెట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులు చేసింది. దీంతో పాటు 2026 బ్రెజ్జా గతంతో పోలిస్తే ఎక్కువ ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇది పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లతో వస్తోంది. కొత్త బ్రెజ్జా అనేక వేరియంట్లలో లభ్యమవుతోంది. సీఎన్జీ ట్యాంకును కార్ అండర్ బాడీకి మార్చింది. దీంతో బూట్ స్పేస్ మరింత కలిసి వస్తుంది. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాకతో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ SUV విభాగంలో భారీ పోటీ నెలకొంది. ఈ కారు హ్యుందార్ వెన్యూ. టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV3XO, కియా సోనెట్‌లో పోటీ పడబోతోంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 7.39 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో కార్‌ను రిలీజ్ చేసింది. మారుతి సుజుకి బ్రెజ్జాకు ఎట్టకేలకు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ 110 హెచ్‌పి, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్‌పి, 139 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత బ్రెజ్జాలో ఈ ఇంజన్‌ను వాడారు. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాట...

ఢిల్లీలో మే 21 నుంచి మే 23 వరకు ఆటోలు, క్యాబ్‌లు బంద్

Image
ఢి ల్లీలోని ఆటో, ట్యాక్సీ, ఇతర వాణిజ్య వాహన డ్రైవర్ల సంఘాలు మే 21 నుంచి మే 23 వరకు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. రోజురోజుకూ పెరుగుతున్న సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ట్యాక్సీ, ఆటో ఛార్జీలను పెంచాలని ఈ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మె కారణంగా మే 21 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ తమ డిమాండ్లను వివరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుతో పాటు ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు అఫీషియల్ గా లేఖలు రాసింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీలోని ఇతర రవాణా సంస్థల సహకారంతో మే 21, 22, 23 తేదీలలో వాహనాలేవీ రోడ్డుపైకి తీసుకురావద్దని డ్రైవర్లందరినీ కోరుతూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. రాబోయే వారం లేదా రెండు వారాల్లోగా టాక్సీ, ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నుండి ఎల...

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ?

Image
దే శవ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి. జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్‌ పెరిగే అవకాశం లేదు : కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

Image
దే శంలో పెట్రోల్, డీజిల్‌  పెరిగే  అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధరల పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసిన ప్రభుత్వం, ధరల స్థిరత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. అయితే, ఈ ధరల ఉపశమనం కేవలం పెట్రోల్, డీజిల్‌కు మాత్రమే వర్తిస్తుందని, వంటగ్యాస్ విషయంలో కాదని అధికారులు స్పష్టత ఇచ్చారు. గత 12 ఏళ్లలో గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 110 మేర పెరిగిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ముడి చమురు దిగుమతుల కోసం భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. సమస్యాత్మకమైన 'హోర్ముజ్ జలసంధి'పై ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర సురక్షిత మార్గాల ద్వారా దిగుమతులను 60% నుండి 70% కి పెంచుకుంది. ప్రస్తుతం హోర్ముజ్ మార్గంలో కూడా రవాణా పునరుద్ధరణ జరగడంతో ఇంధన సరఫరా గాడిలో పడిందని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని వివరించారు. 

పెట్రోల్‌ లేకపోయినా.. ..!'

Image
   కేంద్ర ప్రభుత్వం సడలించిన నూతన పెట్రోల్‌ పంపుల లైసెన్స్‌ నిబంధనల కింద.. పెట్రోల్, డీజిల్‌ విక్రయాల కంటే ముందే సీఎన్‌జీ, ఈవీ చార్జింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. 2019 నవంబర్‌ 8 నాటి నిబంధనల విషయమై ఈ మేరకు తాజాగా వివరణ ఇచ్చింది. ఈ నూతన నిబంధనల కింద పెట్రోల్, డీజీల్‌ విక్రయాలతో పాటు ఏదైనా ఒక నూతన తరం ప్రత్యామ్నాయ ఇంధన విక్రయాలను (సీఎన్‌జీ లేదా ఎల్‌ఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్‌ లేదా బయో ఇంధనం) కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, దీన్ని తప్పనిసరి ఆదేశంగా చూడొద్దని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పెట్రోలు బంకుకి అనుమతి పొందిన సంస్థలు. పెట్రోలు, డీజిల్‌ విక్రయాని కంటే ముందే ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు.