ఢిల్లీలో మే 21 నుంచి మే 23 వరకు ఆటోలు, క్యాబ్‌లు బంద్
ఢి ల్లీలోని ఆటో, ట్యాక్సీ, ఇతర వాణిజ్య వాహన డ్రైవర్ల సంఘాలు మే 21 నుంచి మే 23 వరకు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. రోజురోజుకూ పెరుగుతున్న సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ట్యాక్సీ, ఆటో ఛార్జీలను పెంచాలని ఈ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమ్మె కారణంగా మే 21 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ తమ డిమాండ్లను వివరిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుతో పాటు ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు అఫీషియల్ గా లేఖలు రాసింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మధ్యతరగతి డ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీలోని ఇతర రవాణా సంస్థల సహకారంతో మే 21, 22, 23 తేదీలలో వాహనాలేవీ రోడ్డుపైకి తీసుకురావద్దని డ్రైవర్లందరినీ కోరుతూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. రాబోయే వారం లేదా రెండు వారాల్లోగా టాక్సీ, ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నుండి ఎల...