కుర్కురే ప్యాకెట్‌లోని బొమ్మ మింగి ఐదేళ్ల బాలుడు మృతి !

Telugu Lo Computer
0

ర్ణాటకలోని మైసూర్ జిల్లా గౌరీపుర గ్రామంలో కుర్కురే ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బంతిని మింగి ఐదేళ్ల బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలుడు ఆడుకుంటున్న సమయంలో కుర్కురే ప్యాకెట్‌లో కాంప్లిమెంటరీగా వచ్చిన ప్లాస్టిక్ బంతిని అనుకోకుండా మింగేశాడు. ఆ బొమ్మ నేరుగా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి ఆడక బాలుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన బాలుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడని సమాచారం. ఈ విషాద ఘటనపై బాలుడి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దీనివల్ల ప్రస్తుతానికి ఎలాంటి కేసు (UDR) నమోదు చేయలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల ప్యాకెట్లలో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default