మూడు పవర్‌ఫుల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్న హెచ్‌ఎమ్‌డీ

Telugu Lo Computer
0

హెచ్‌ఎమ్‌డీ సంస్థ త్వరలో తమ కొత్త Pulse 2 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా Pulse 2, Pulse 2 Plus, Pulse 2 Pro అనే మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. లీకైన సమాచారం ప్రకారం.. Pulse 2, Pulse 2 Plus ఫోన్లు 6.67 ఇంచుల HD+ IPS LCD డిస్‌ప్లేతో రానున్నాయి. ఇందులో Pulse 2 మోడల్ 90Hz రీఫ్రెష్ రేట్‌ను, ప్లస్ మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. కలర్స్ విషయానికొస్తే Pulse 2 ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో రానుండగా.. Pulse 2 Plus వేరియంట్ ఆప్రికాట్, డార్క్ బ్లూ రంగుల్లో లభించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోనే Pulse 2 Pro టాప్‌ఎండ్ మోడల్‌గా రానుంది. ఇది 6.72 ఇంచుల డిస్‌ప్లేతో పాటు 90Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఇస్తున్నారు. విశేషమేమిటంటే.. అద్భుతమైన సెల్ఫీల కోసం ముందు భాగంలో ఏకంగా 50MP కెమెరాను అందించనున్నారు. ఇక మిగిలిన రెండు మోడళ్లలో వెనుక వైపు 50MP + 2MP కెమెరా సెటప్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలోనూ యూనిసాక్ T615 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అలాగే 20W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. ప్రో వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో రానుండగా, Pulse 2 మోడల్ 4GB RAM, ప్లస్ మోడల్ 6GB RAM వేరియంట్లలో 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో రానున్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, గ్లేసియర్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ రంగుల్లో ప్రో మోడల్ అందుబాటులో ఉండనుంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default