విదేశీ దిగుమతిదారులకు $100 బిలియన్లను తిరిగి చెల్లించిన అమెరికా

Telugu Lo Computer
0

మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల దిగుమతులపై విధించిన భారీ టారిఫ్‌లను ఆ దేశ సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో చెల్లవంటూ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద అత్యవసర అధికారాల విధానం కింద యూఎస్ ప్రభుత్వం ఇప్పటికే బాధితుల నుంచి సుమారు $166 బిలియన్లు వసూలు చేసింది. కాగా, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జులై 31 నాటికి దాదాపు $100 బిలియన్లనువిదేశీ దిగుమతిదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లించింది. అమెరికా వాణిజ్య చరిత్రలోనే ఇంతటి భారీ మొత్తంలో సుంకాల డబ్బును వెనక్కి ఇవ్వడం ఇది అత్యంత పెద్ద రిఫండ్‌గా రికార్డు సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ యంత్రాంగం వ్యాపారులకు ఈ రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకొచ్చి వేగంగా నిధులను విడుదల చేస్తోంది. అయితే, వ్యాపార వర్గాలకు ఉపశమనం లభించినప్పటికీ, వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ వదిలిపెట్టలేదు. పాత టారిఫ్‌లు రద్దయిన వెంటనే, ఇతర చట్టపరమైన నిబంధనల కింద పరిమిత శాతం కొత్త టారిఫ్‌లను, విభాగాల వారీగా సుంకాలను ట్రంప్ తిరిగి అమలులోకి తీసుకొచ్చారు. దీనితో కోర్టు తీర్పు సవాలును తట్టుకుంటూనే తమ దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు ట్రంప్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default