మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ హోదాలో పార్లమెంట్ సమావేశాలకు హాజరైయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది.
పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ధర్మేంద్ర ప్రధాన్ : అనుకూల, వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన పార్లమెంట్ ప్రాంగణం
July 27, 2026
0
Tags