హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో ఒరిస్సా బరంపూర్ నుంచి 2.360 కేజీల గంజాయిని తుర్కపల్లికి తీసుకెళ్లుతున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ సీఐ కోటమ్మ, ఎస్సై ఆఖిల్ సిబ్బంది పట్టుకున్నారు. బరంపూర్ నుంచి తీసుకు వచ్చిన గంజాయిని బైక్‌పై లోతుకుంట నుంచి హకీంపేట్ రోడ్డులో వెలుతుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యా గ్‌లో ఉన్న 2.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టి. రామకృష్ణ కృష్ణ (25) ఏ. అజయ్ (26)లను అరెస్టు చేసి గంజాయితో పాటు నిందితులను అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బిక్షారెడ్డి సిబ్బంది లాల్‌గూడలో సూర్య అనే వ్యక్తి 121 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడని, గంజాయిని సికింద్రాబాద్ ఎక్సయిజ్ స్టేషన్‌లో అప్పగించి నట్లు సీఐ తెలిపారు.
మల్కాజిగిరిలో 2.360 కేజీల గంజాయి పట్టివేత : ఇద్దరు నిందితుల అరెస్ట్
July 24, 2026
0
Tags