జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్‌పళ్లి, జస్టిస్ వెంకిట సుబ్రమణి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉంటూ అదే న్యాయస్థానానికి జడ్జీ అయిన వారి సంఖ్య 12కి చేరింది. అయితే, వయసు రీత్యా కొత్త న్యాయమూర్తుల్లో ఎవ్వరూ సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం లేదు.
ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం
June 02, 2026
0
Tags