బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగానే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 190 స్థానాల్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. దాంతో మమత కంచుకోటను బద్దలుకొట్టి రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరోవైపు రాష్ట్రంలో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. బరబానిలోని టీఎంసీ ఆఫీస్ కు నిప్పు పెట్టారు. ఈ మేరకు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో ఆఫీస్ బూడిదైంది. అటు అసన్ సోన్ లోనూ టీఎంసీ ఆఫీస్ పై కొందరు దాడికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. ఆఫీస్ లోని కుర్చీలు, టేబుల్స్ ను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బలగాల్ని ఇప్పటికే మోహరించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్లుగా బెంగాల్ లో ఎదురులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీకి తాజాగా కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత రెండు దఫాల్లో బెంగాల్ లో విక్టరీ కోసం బీజేపీ తీవ్రంగా శ్రమించింది. కానీ అది సాధ్యపడలేదు. అయితే ఎట్టకేలకు ఈసారి బెంగాల్ లో బీజేపీ జెండా రెపరెపలాడింది.
0 Comments