తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. నిన్న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓటమి నేపథ్యంలో ఇవాళ ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను గవర్నర్‍కు పంపించారు. కాగా నిన్నటి ఫలితాల్లో డీఎంకే కూటమికి 72 స్థానాలు అన్నాడీఎంకేకు 53 స్థానాలు రాగా టీవీకే పార్టీకి 108 విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118 సీట్లుతో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలనే విషయంపై టీవీకే నేతలతో ఆయన చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించడానికి విజయ్అ పాయింట్ మెంట్ కోరారు.
0 Comments