ఉపాధి పనులను పరిశీలించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ : కూలీలతో కలిసి అల్పాహారం తిన్న మంత్రి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం భూదనం పల్లి లో ఉపాధి హామీ పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మంత్రి ముచ్చటించారు. కుటుంబ వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో కూలీలు అల్పాహారం తినే సమయంలో మంత్రిని ఆహ్వానించగా మంత్రి సత్య కుమార్ వారితో కలిసి కింద కూర్చొని కూలీలు తెచ్చిన అల్పాహారాన్ని ఇష్టంగా భోంచేశారు. తమ మధ్య మంత్రి కూర్చుని అల్పాహారం తినడంతో కూలీలు సంతోషం వ్యక్తపరిచారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default