అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ రూ. 1,29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్ ఫోన్ పై 30 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందించి రూ. 99,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్  క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో 5% అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన Snapdragon 8 Elite చిప్ సెట్ మరియు జతగా 12GB LPDDR5X ర్యామ్ తో అందించింది. ఈ ఫోన్ అద్భుతమైన గేమింగ్ మరియు సూపర్ మల్టీ టాస్కింగ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో వెనుక 200MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో (5x) మరియు 10MP టెలిఫోటో (3x జూమ్) కెమెరా కలిగిన క్వాడ్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 8K UHD మరియు 4K UHDవ్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో చాలా అడ్వాన్స్డ్ AI నోయిస్ రిడక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default