దుబాయ్, బాగ్దాద్ లపై ఇరాన్ భారీ దాడి

Telugu Lo Computer
0


దుబాయ్‌పై ఇరాన్‌ మరోసారి విరుచుకుపడింది. దుబాయ్‌ పైనాన్షియల్‌ జిల్లా దగ్గర దట్టమైన పొగ కమ్మేసింది. డ్రోన్‌ శకలాలు బయపడ్డాయని అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లో ఇది రెండోసారి దాడి. అటు ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌పైనా ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. సెంట్రల్ దుబాయ్‌లోని ఒక భవనం వెలుపలి భాగాన్ని ఢీకొన్న విమానం శిథిలాల వల్ల ఈ సంఘటన జరిగిందని అధికారులు నిర్ధారించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని దుబాయ్ మీడియా ఆఫీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో తెలిపింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ఒక అమెరికన్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిందని వెలువడ్డాయి. దాడి తర్వాత ట్యాంకర్ మంటల్లో చిక్కుకుందని సమాచారం. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ను క్షిపణి ఢీకొట్టిందని ఇరాకీ భద్రతా అధికారులు తెలిపారు. ఎంబసీ ప్రాంగణం నుండి పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపించిందని మీడియా పేర్కొంది. దౌత్య కార్యాలయం లక్ష్యంగా దాడి జరిగిందని భద్రతా వర్గాలు కూడా ధృవీకరించాయి. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రాయబార కార్యాలయం ఇరాక్ కోసం తన ‘లెవల్ 4’ భద్రతా హెచ్చరికను తిరిగి జారీ చేసింది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default