తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, దొంగచింత తండాకు చెందిన ధరావత్ సోముల (45), ధరావత్ మంగమ్మ (40) గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పఠాన్‌చెరులో జంట హత్యలు
Saturday, March 14, 2026
crime Dharavath Mangamma (40) Double Murder in Patancheru identified as Dharavath Somula (45) Indresham Sangareddy district telangana
No comments:
Post a Comment