పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో పెట్రోల్ కోసం ఎగబడిన జనం ఘర్షణకు దిగారు. లాహోర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని సియాల్‌కోట్ - దస్కా రోడ్డులో ఉన్న ఒక పెట్రోల్ బంకు వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పెట్రోల్ కొనుగోలు విషయంలో వినియోగదారులకు, బంకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహం చెందిన కొందరు కస్టమర్లు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులో ఘర్షణ : కాల్పుల్లో ఒకరు మృతి
March 08, 2026
0
Tags