అంతర్జాతీయ మహిళా దినోత్సవం : మహిళలకు ఎస్బీఐ, యెస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ ప్రత్యేక పథకాలు

Sunday, March 8, 2026

financial security healthcare home construction and business growth International Women's Day L&T Finance special schemes for women national sbi Yes Bank

t f B! P L


అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్బీఐ, యెస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, వ్యాపార వృద్ధికి తోడ్పడేలా సరికొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చాయి.

మహిళల ఆర్థిక, జీవనశైలి అవసరాలను దృష్టిలో ఉంచుకుని యెస్ బ్యాంక్ 'యెస్ ఎసెన్స్ ఉమెన్స్‌ శాలరీ అకౌంట్'ను ప్రారంభించింది. అలాగే రూ. 5 లక్షల కాంప్లిమెంటరీ హెల్త్ కవర్ మరియు ఏడాదికి ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు. మొదటి సంవత్సరం ఉచితంగా లాకర్ సౌకర్యం, కాంప్లిమెంటరీ ఎలిగెన్స్ డెబిట్ కార్డు ద్వారా ఏటా రూ. 6,000 వరకు (5% క్యాష్‌బ్యాక్) పొందే అవకాశం కల్పించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా సాధికారత కోసం 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,590 కోట్లు) భారీ సామాజిక రుణ సౌకర్యాన్ని ప్రకటించింది. లింగ వివక్షను తగ్గించడం మరియు ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక 'జెండర్-థీమ్' రుణంగా గుర్తింపు పొందింది, ఇది మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక వృద్ధికి తోడ్పడనుంది.

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ 'స్ఫూర్తి' పేరుతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక లోన్ స్కీమ్ తెచ్చింది. రూ. 75 లక్షల వరకు రుణం పొందే అవకాశం. గృహ రుణాలకు 25 ఏళ్లు, వ్యాపార ఆస్తుల హామీపై 12 ఏళ్ల వరకు సమయం. వ్యాపారంలో 50% వాటా ఉండి, ఏడాదికి కనీసం రూ. 5 లక్షల లాభం పొందే మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ