ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొంటున్న గల్గోటియాస్ యూనివర్సిటీ రెండు విషయాల్లో దొరికిపోయింది. ఇవాళ ఉదయం ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గల్గోటియాస్ యూనివర్శిటీ ప్రదర్శించిన రోబో డాగ్ తొలి వివాదానికి కారణమైంది. అది అచ్చంగా తాము తయారు చేసిందేనని, తమ యూనివర్శిటీ మొత్తం తిరుగుతుందని చెప్పుకున్న ప్రతినిధులకు అంతలోనే షాక్ ఎదురైంది. ఇది చైనా తయారీ రోబోడాగ్ అని అంతా పసిగట్టేశారు. అదే సమయంలో చైనా మీడియా కూడా తమ ప్రొడక్ట్ ను కాపీ కొట్టి ఇలా చెప్పుకోవడమేంటని సోషల్ మీడియాలో భారత్ ను కడిగేస్తోంది. దీంతో అబ్బే ఈ రోబోడాగ్ చైనాదేనని వర్సిటీ ఒప్పుకుంది. ఈ వివాదం నేపథ్యంలో ఏఐ సదస్సులో స్టాల్ తీసేసి వెళ్లిపొమ్మని నిర్వాహకులు ఈ వర్సిటీని ఆదేశించారు.ఈ రోబో డాగ్ విషయంలో తాము చెప్పిన మాటల్ని వక్రీకరించారంటూ యూనివర్శిటీ ప్రతినిధి నేహాసింగ్ మీడియా ముందు సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. ఈ వివాదం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే అదే వర్శిటీ తెచ్చిన మరో ప్రొడక్ట్ థర్మోకోల్ డ్రోన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్శిటీ పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఈ డ్రోన్ మోడల్ థర్మోకోల్‌తో తయారైంది. ప్లాస్టిక్ ఫిల్మ్‌లో చుట్టి, రబ్బర్ బ్యాండ్‌లతో బిగించబడి ఉన్న దీని తాత్కాలిక నిర్మాణం ఆన్‌లైన్‌లో విమర్శలకు దారితీసింది..
ఏ ఐ ఇంపాక్ట్ సదస్సు : గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ చేసిన నిర్వాహకులు
February 18, 2026
0
Tags