'ప్యాక్స్ సిలికా' కూటమిలో చేరనున్న భారత్

Telugu Lo Computer
0


ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల సరఫరాను పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన 'ప్యాక్స్ సిలికా' కూటమిలో భారత్ చేరనుంది. 2025 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ కూటమిలో భారత్ అధికారికంగా భాగస్వామి కావడంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలో దేశ ప్రతిష్ట మరింత పెరగనుంది. మిత్రదేశాల మధ్య చిప్స్, ఏఐ సరఫరా వ్యవస్థను సురక్షితం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం. ఈ భాగస్వామ్యం ద్వారా సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాల లభ్యత, ఏఐ పరిశోధనల్లో భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో బలంగా ఉన్న భారత్, ప్యాక్స్ సిలికాలో చేరడంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది. సుస్థిరమైన సరఫరా గొలుసు ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగిన చిప్ తయారీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకోనుంది. గతంలో సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందంతో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default