నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లపై 500 ఎంబీ అదనపు డేటాను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

Telugu Lo Computer
0


బీఎస్ఎన్ఎల్ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లపై 500 ఎంబీ అదనపు డేటాను ప్రకటించింది. రూ. 225, రూ. 347, రూ. 485, రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ పై డైలీ 500ఎంబీ హై స్పీడ్ డేటా అదనంగా ప్రకటించింది. అంటే, ఈ నాలుగు ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ప్లాన్ తో వచ్చే డైలీ డేట్ కాకుండా 500ఎంబీ డేటా అదనంగా లభిస్తుంది. ఈ అదనపు డేటా ఆఫర్ కేవలం ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 3GB (2.5GB + 500MB) హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం 30 రోజులు అందిస్తుంది. ఈ డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటా లిమిట్ క్లోజ్ అయిన తర్వాత కూడా 40Kbps తో రోజంతా అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.

రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ : ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ మరియు డి 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 50 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB (2GB + 500MB) హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 40Kbps తో రోజంతా అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది.

రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ కూడా పైన తెలిపిన రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని బెనిఫిట్స్ 72 రోజులు అందిస్తుంది అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 72 రోజులు డైలీ 2.5జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS బెనిఫిట్స్ 72 రోజులు అందుకుంటారు.

రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ : ఇది వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ స్ చేస్తే పూర్తిగా సంవత్సరం మొత్తం రోజుకు 500MB అదనపు డేటా చొప్పున ఏకంగా 182.5GB డేటా ఉచితంగా అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 2.5 జీబీ డేటా మరియు డైలీ 100SMS లాభాలు అందుకోవచ్చు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default