సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోడౌన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గమనించి స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు నాలుగు ఫైర్ ఇంజిన్లతో స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో గోదాంలో నిల్వ ఉన్న రూ.లక్షలు విలువ చేసే అగ్నిమాపక పరికరాలు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, సంబంధిత సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ సిబ్బంది, పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో గోదాం చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నప్పటికీ, సమయానికి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది.
0 Comments