మొబైల్ మార్కెట్లోకి డ్రీమ్ టెక్నాలజీ అడుగుపెడుతోంది. రహస్యంగా తయారవుతున్న ఈ ఫోన్ వివరాలు యూరోపియన్ సర్టిఫికేషన్ సైట్ ద్వారా లీక్ అయ్యాయి. ఆ వివరాలు చూస్తుంటే, డ్రీమ్ కంపెనీ గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ మోడల్ నంబర్ డబ్ల్యూ5110గా లిస్ట్ అయ్యింది. బహుశా దీనిని 'డ్రీమ్ ఈ1' పేరుతో మార్కెట్లోకి తేవచ్చు. ఇది చూడ్డానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా కాంపిటేటివ్‌గా కనిపిస్తోంది. ఇందులో 6.67 అంగుళాల పెద్ద AMOLED డిస్‌ప్లేను అమర్చారు. దీనివల్ల వీడియోలు, గేమ్స్ చాలా క్లియర్‌గా, మంచి రంగులతో కనిపిస్తాయి. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక వైపు ఏకంగా 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇచ్చారు. దీనికి తోడుగా మరో రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు (ఒకటి డెప్త్ కోసం, మరొకటి మ్యాక్రో షాట్స్ కోసం) ఉన్నాయి. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. డ్రీమ్ E1లో రోజంతా వాడుకునేలా 5,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 54 గంటల పాటు వాడుకోవచ్చని రేటింగ్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా, 800 సార్లు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతం పైనే ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది. మాన్యువల్‌లో బ్యాటరీని యూజర్ మార్చుకోవచ్చని ఉన్నా, సొంత ప్రయోగాలు చేయకుండా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడమే మంచిది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని డిజైన్ ఉండబోతోంది. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం NFC సౌకర్యం కూడా ఉంది. స్టోరేజ్ ఆప్షన్ల విషయానికి వస్తే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు, అంటే అవసరమైతే మెమరీ కార్డు వేసుకుని స్టోరేజ్ పెంచుకోవచ్చు. దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఉంది. ఈ రోజుల్లో చాలా ఫోన్లలో కనిపించని 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇందులో ఉండటం మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అలాగే స్క్రీన్ మీదనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
డ్రీమ్ టెక్నాలజీ నుంచి 'డ్రీమ్ E1' స్మార్ట్‌ఫోన్ !
December 20, 2025
0
Tags