ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 30 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు పంపిణీ చేస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ
December 27, 2025
0
Tags