జపాన్‌లోని కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : అగ్నికి ఆహుతైన 17 వాహనాలు, ఒకరు మృతి, 26 మందికి గాయాలు

Saturday, December 27, 2025

17 vehicles engulfed in flames 26 injured condition of five of them is critical international Major accident on the Kan-Etsu Expressway in Japan One dead

t f B! P L


జపాన్‌లోని గున్మా ప్రిఫెక్చర్‌లోని మినాకామి పట్టణం సమీపంలో గల కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం సంభవించింది.  భారీగా మంచు కురుస్తుండడంతో రోడ్డుపై గడ్డకట్టి 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో అనేక వాహనాలు కాలి బూడిదయ్యాయి. కాగా రాత్రి 7:30 గంటల సమయంలో మొదట రెండు ట్రక్కులు ఢీకొన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత వెనుక వస్తున్న వాహనాలు బ్రేక్స్ వేయడంతో విఫలమవ్వడంతో ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నట్టు చెబుతున్నారు. క్షణాల వ్యవధిలోనే సుమారు 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దాదాపు 17 వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలానే 26 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వే రాజధాని టోక్యోను నిగాటా ప్రిఫెక్చర్‌తో అనుసంధానించే కీలక రహదారి. జపాన్‌లో నూతన సంవత్సర సెలవులు ప్రారంభమైన వేళ, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ నిప్పాన్ ఎక్స్‌ప్రెస్‌వే కంపెనీ ప్రమాదం కారణంగా రహదారిపై రాకపోకలను నిలిపివేసింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ