'రమ్మీ మంత్రి' మాణిక్‌రావ్‌ కోకాటే రాజీనామా : హౌసింగ్‌ స్కాం కేసులో దోషిగా తేలిన మంత్రి

Telugu Lo Computer
0


హారాష్ట్రలో ఎన్సీపీ సీనియర్‌ నేత, క్రీడా శాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకాటే రాజీనామా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభలోనే ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి, రమ్మీ మినిస్టర్‌గా ఈయన పేరు పొందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖకు మార్చడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు దశాబ్దాల నాటి హౌసింగ్‌ స్కాం కేసులో నాసిక్‌ సెషన్స్‌ కోర్టు బుధవారం మాణిక్‌రావ్‌ కొకాటేను దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కోకాటే రాజీనామా లేఖ ఇంకా సీఎం పేషీకి చేరలేదు. దీంతో.. ప్రస్తుతానికి ఆయన పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు. 1995లో హౌజింగ్‌ సొసైటీలకు సంబంధించి ఆర్థిక బలహీన వర్గాల కోసం కేటాయించిన 10% కోటాను దుర్వినియోగం చేశారని మాణిక్‌రావ్‌, ఆయన సోదరుడు విజయ్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో.. ఛీటింగ్‌, ఫోర్జరీలకు పాల్పడడ్డారని తేలడంతో ఇద్దరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 సెక్షన్‌ 8 ప్రకారం.. క్రిమినల్‌ కేసుల్లో ప్రజాప్రతినిధులకు(ఎమ్మెల్యే/ఎంపీ) రెండేళ్లు.. అంత కంటే ఎక్కువ శిక్ష పడితే తక్షణమే సభ్యత్వం రద్దు అవుతుంది. ఒకవేళ పైకోర్టులు వాటిపై స్టే విధిస్తే వాళ్లకు ఊరట దక్కుతుంది. దీంతో బుధవారం నాడే బాంబే హైకోర్టులో నాసిక్‌ కోర్టు తీర్పును కోకాటే బ్రదర్స్‌​ సవాల్‌ చేశారు. అత్యవసర విచారణను శుక్రవారం జరుపుతామని కోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అనారోగ్యం పేరిట ముంబైలోని లీలావతి కొకాటే చేరడంతో అరెస్ట్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default