ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
0 Comments