మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన,ఎన్‌సీపీ) 288 మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు జరిగిన పోటీలో కూటమి 207 స్థానిక సంస్థల అధ్యక్ష పదవులు గెల్చుకుంది. మహావికాస్ అఘాడియా (ఎంవిఏ, కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ శరత్ పవార్) సమిష్టిగా పోరాడినా 44 స్థానాలకే పరిమితం అయ్యింది. కూటమి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నగర పంచాయతీలలో పట్టు నిరూపించుకుంది. బీజేపీ 117 మున్సిపల్ అధ్యక్ష పదవులు గెల్చుకుంటే, శివసేన 53, ఎన్సీపీ 37 పదవులు గెల్చుకున్నాయి. కాంగ్రెస్ 28, ఎన్సీపీ(SP) 7,శివసేన (UBT) 9 స్థానాలను గెల్చుకుంది. ఎన్నికల సంఘంలోని నమోదైన పార్టీలు 4 స్థానాలు గెలుచుకోగా, 23 మున్సిపల్ అధ్యక్ష స్థానాలు గుర్తింపు లేని రిజిస్ట్రర్డ్ పార్టీలకు దక్కాయి. 5 స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెల్చుకున్నారు. ఇంత గొప్ప ఘన విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటరు మహాశయులకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయం
December 22, 2025
0
Tags