కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ : ముగ్గురు మృతి, 15 మంది గాయాలు

Monday, December 22, 2025

15 injured Criem Jaipur mandal Lorry hits Bolero vehicle carrying laborers from behind Mancherial district near Indaram X Road telangana Three dead

t f B! P L


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. మహారాష్ట్ర నుంచి సుల్తానా బాద్ కు వెళ్తుండగా తెల్లవారు జామున మూడు గంటలకు రోడ్డు మీద ఆపిన బొలెరో ను లారీ డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ