కేసీఆర్‌కి ఫాంహౌస్‌లో చలి పెడుతోందని, అందుకే బయటకు వచ్చారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభ పెడుతున్న తెలంగాణ భవన్‌కు స్థలం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం వల్ల ఎలాంటి లాభం లేదని విమర్శించారు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గిచుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై కేటీఆర్‌కు ఆయన తండ్రి కేసీఆర్ హితబోధ చేయాలని హితవు పలికారు. నది జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కి ఎక్కడుందన్నారు. పక్క రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర సరెండర్ అయింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ప్రశంసించారు.
0 Comments