భారత దేశ మొట్టమొదటి మల్టీ యుటిలిటీ ఈ-సైకిల్ !

Telugu Lo Computer
0

హెచ్ యుఎం సైకిల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. దీనికి అసలు పెట్రోల్‌ అవసరం లేదు, ఎక్కువ మెయింటెనెన్స్‌ కుడా అవ్వదు. తక్కువ ఖర్చుతో దీనిని వినియోగించుకోవచ్చు. ఇది సైకిల్ భారత దేశంలోనే మొట్టమొదటి మల్టీ యుటిలిటీ ఈ-సైకిల్. దీన్ని కార్గో ఈ-సైకిల్‌గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సైకిల్ 120 కేజీల బరువు మోయగలదు. ఎలాంటి రోడ్లపైనైనా వెళ్లగలదు. ఒక్కసారి బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 105 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ బ్యాటరీకి మూడేళ్ల వారంటీ కుడా ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ సైకిల్ నడిపేవారికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ సైకిల్ 27 కేజీల బరువు ఉంటుంది. ఈ సైకిల్  వేరియంట్లలో ఆరెంజ్, బ్లాక్, బెర్రీ బ్లూ, కార్బన్ గ్రే కలర్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ-సైకిల్‌ ధర రూ. 31,349 ఉంది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default