వరంగల్‌లో రిటైర్డ్‌ బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య !

Telugu Lo Computer
0

తెలంగాణలోని వరంగల్‌లో సొంత కారులోనే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి రాజామోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో అటుగా వెళ్లిన కొందరు స్థానికులు కారులో డెడ్ బాడీని గుర్తించి మట్వాడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కాళ్లు, చేతులు కట్టేసి హతమార్చిన తీరు గగుర్పాటును కలిగిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడు బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజామోహన్ ను కాళ్లు, చేతులను కట్టేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాళ్లు, ఇనుప గొలుసులతో బంధించి మరీ కిరాతకంగా హతమార్చారు. తలపై మూడు చోట్లా, గొంతు సమీపంలో కూడా కత్తి గాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా రాజా మోహన్‌ను తన కారులోనే హత్య చేసి, మంగళవారం తెల్లవారుజామున 3.49 గంటల ప్రాంతంలో ఆ కారును రంగంపేటలో పార్క్ చేసి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కాగా.. పోలీసులు ఆ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ వ్యక్తి బ్లాక్ స్వెట్టర్ ధరించి కారు వద్ద నుంచి వెళ్తున్నట్టు గుర్తించారు. అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మట్వాడా సీఐ గోపి, ఇతర పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. ఏపీ 36 క్యూ 1546 అనే నెంబర్ గల శాంట్రో కారులో ఉన్న డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించి, మృతుడిని హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలిగేటి రాజా మోహన్ గా నిర్ధారణకు వచ్చారు. రాజా మోహన్ బ్యాంక్ ఉద్యోగి పని చేస్తుండగా. హత్య ఎవరు చేసి ఉంటారనే విషయం దర్యాప్తు జరుపుతున్నారు. తెల్లవారుజామున 3.49 గంటల సమయంలో కారు పార్కింగ్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఆ సమయంలో అక్కడ రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఆయన హత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి నుంచి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default