50 వాట్ల విద్యుత్తును ఇంటర్నల్‌ బ్యాటరీకి నిరవధికంగా అందించే 'షైన్‌-2.0' టర్బైన్‌ !

Telugu Lo Computer
0


వనశక్తిని వాడుకోవాలంటే, భారీ విండ్‌ టర్బైన్‌లు అవసరమవుతాయి. గాలి బాగా వీచే ప్రదేశాన్ని చూసుకుని, ఒకచోట పాతిపెట్టాక వాటిని తరలించడం అంత తేలిక కాదు. అయితే ఈ తేలికపాటి విండ్‌ టర్బైన్‌ను మాత్రం ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట ఆరుబయట ఫ్యాన్‌ మాదిరిగా నిలిపి, దీని నుంచి విద్యుత్తును పొందవచ్చు. పిక్నిక్‌లలో టెంట్లు వేసుకున్నప్పుడు, టెంట్లకు కావలసిన విద్యుత్తును దీని ద్వారా పొందవచ్చు. కెనడియన్‌ కంపెనీ 'ఆరియా టెక్నాలజీస్‌' ఈ పోర్టబుల్‌ విండ్‌ టర్బైన్‌ను 'షైన్‌-2.0' పేరుతో రూపొందించింది. వాడకం పూర్తయ్యాక దీనిని చక్కగా మడిచి, సంచిలో వేసేసుకోవచ్చు. 'షైన్‌-2.0' టర్బైన్‌ 50 వాట్ల విద్యుత్తును ఇంటర్నల్‌ బ్యాటరీకి నిరవధికంగా అందిస్తుంది. ఈ విద్యుత్తు ఒక ఇంట్లో వాడుకునే విద్యుత్తు పరికరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default