విమానాల తయారీ సంస్థ బోయింగ్ దాదాపుగా 17 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ విషయంపై బోయింగ్ సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బర్గ్ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి గణనీయమైన తగ్గింపు అవసరమని దీంతో రాబోయే నెలల్లోఉద్యోగుల పరిమాణాన్ని సుమారు 10 శాతం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గ్జిక్యూటివ్‌లు, మేనేజర్‌లు తదితరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం ఇలా ఉండగా 33,000 మంది యూఎస్ వెస్ట్ కోస్ట్ కార్మికులు ఉద్యోగ ప్రయోజనాల కోసం సమ్మె నిర్వహిస్తునారు. ఈ కారణంగా 737 MAX, 767 మరియు 777 జెట్‌ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో బోయింగ్ సంస్థ దాదాపుగా $5 బిలియన్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో ఈ నష్టాల్ని సరిచేందుకు ఈ ఉద్యోగుల తొలగింపుకి సిద్దమైనట్లు తెలుస్తోంది.
బోయింగ్ కంపెనీలో 17 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం ?
October 12, 2024
0
Tags