తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపం కుమారాజీపేటకి చెందిన తమిళరసన్, అరవిందన్, ప్రకాష్ షోళింగర్‌లోని టైర్ల తయారీ పరిశ్రమలో పని చేస్తూ నెల కిందట మానేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3 కోట్లు ఆన్‌లైన్ నగదు లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)కి సమాచారం అందింది. అధికారులు గురువారం సాయంత్రం యువకుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. అనంతరం తమిళరసన్, అరవిందన్, ప్రకాష్, అజిత్‌ను అరెస్టు చేసి బెంగళూరు తీసుకెళ్లారు. ముగ్గురు యువకులు ఉద్యోగం కోసం చెన్నైలోని అజ్మల్ అనే వ్యక్తిని కలిసినట్లు, అతని ద్వారా కొత్తగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి, తలా రూ. కోటి చొప్పున రూ.3 కోట్లు జమ చేసినట్లు తెలిసింది. అజ్మల్‌పై ఇదివరకే రూ.8 కోట్లు హవాలా నగదు మోసం కేసు ఆంధ్రప్రదేశ్ చీరాల పోలీస్‌స్టేషన్‌లో ఉంది.
యువకుల బ్యాంకు ఖాతాల్లో హవాలా సొమ్ము - అరెస్టు చేసిన ఈడీ అధికారులు
September 14, 2024
0
Tags