చెన్నైలో బీటెక్ విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ !

Telugu Lo Computer
0


చెన్నైలో ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫుడ్పాయిజనింగ్ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ ఈరోడ్ జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default