తీహార్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన కోర్టు ఆదేశాల ప్రకారం జైలుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయన రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడ నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడిన కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ''మధ్యంతర బెయిల్‌పై బయటికి రావడంతో ఎన్నికల ప్రచారంలో నా ప్రయత్నాలు ఫలించాయి. 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. కూటమి తరఫున ప్రచారం చేశా. దేశ ప్రయోజనాలకే నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే ఆమ్‌ ఆద్మీ పార్టీ'' అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని (మోడీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ) కేజ్రీవాల్‌ ఆరోపించారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default