కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు రాళ్ల దాడి

Telugu Lo Computer
0

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని దామరకుంట వద్ద కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ రాళ్ల దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తలు ముఖాముఖి ఎదురు పడటంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల వాహన శ్రేణి పైకి విచక్షణారహితంగా రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పలు వాహనాలు ధ్వంసమై స్థానికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తీవ్ర ఘర్షణలతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default