ఉత్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ 'శుద్ధి' కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ మల్లికార్జున ఖర్గే ఆరోపణ

Telugu Lo Computer
0

త్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ నేతలు 'శుద్ధి' కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలు రాజ్యసభలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటన కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఖర్గే మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఖర్గే.. హల్ద్వానీలోని రామలీలా మైదానంలో తన సభ జరగాల్సిన ప్రదేశంలో తన రాక తర్వాత కొందరు బీజేపీ నేతలు హవనం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబిస్తోందని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default