జూన్ 2 న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన ప్రతి కుటుంబానికి 'ఇందిరమ్మ భీమా' పథకాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా రూ.5 లక్షల భీమా రక్షణ కల్పించనుంది. కుటుంబంలో ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు సంభవించి యజమాని ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ రూ.5 లక్షల భీమా మొత్తం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు (పొదుపు సంఘాలకు) రాబోయే రోజుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా, రెండో దశ కింద మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default