ఆస్ట్రియాలోని చిమిటన్‌హోహే పర్వత శ్రేణుల్లో ఓ పారాగ్లైడర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారాచూట్ సహాయంతో గ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఓ విమానం అకస్మాత్తుగా దాన్ని ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆస్ట్రియా ఉత్తర ప్రాంతంలో ఉన్న చిమిటన్‌హోహి పారాగ్లైడింగ్‌కు పాపులర్ స్పాట్.స్థానిక పోలీసుల ప్రకారం 44 ఏళ్ల ఓ మహిళా పారాగ్లైడర్.. అక్కడి పర్వతాలపై గ్లైడింగ్ చేస్తున్న సమయంలో.. ఓ సైట్‌సీయింగ్ విమానం ఆమె పారాచూట్‌ను ఢీకొట్టింది. విమానం వేగానికి ఆ గ్లైడర్ పారాచూట్ దెబ్బతిన్నది. సబ్రినా అనే మహిళ సుడులు తిరిగింది. కంట్రోల్ తప్పడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈ ఘటన మొత్తం పారాచూట్‌కు ఉన్న కెమెరాకు చిక్కింది. కాసేపు గతి తప్పిన పారాచూటర్ ఆ తర్వాత తన వద్ద ఉన్న రిజర్వ్ పారాచూట్‌తో మేనేజ్ చేసుకున్నది. ఆస్ట్రియా పోలీసులు ఆమెను వైద్యచికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పారాగ్లైడర్, పైలెట్ గాయాలతో బయటపడ్డారని పోలీసులు వెల్లడించారు.
0 Comments