బీహార్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చిన్న మంత్రివర్గం : ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు ప్రమాణం

Telugu Lo Computer
0


బీహార్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటైంది. ముఖ్యమంత్రితో పాటు కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే ప్రమాణం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనతాదళ్ (యునైటెడ్) నేతలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.బి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో శాఖల పంపిణీ ఆసక్తికరంగా మారింది. హోం, సాధారణ పరిపాలన, ఆరోగ్యం, ఆర్థికం, వ్యవసాయం, రహదారుల నిర్మాణం వంటి ఏకంగా 29 కీలక విభాగాలను ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తన వద్దే ఉంచుకున్నారు. ఇది ప్రభుత్వంలో బీజేపీ పట్టును స్పష్టం చేస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరికి 10 శాఖలు, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు 8 శాఖలు దక్కాయి. గతంలో నితీష్ కుమార్ వద్దే ఉండే అత్యంత కీలకమైన 'హోం శాఖ' ఈసారి జేడీ(యు)కి దక్కకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరకపోవడానికి పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో మంత్రుల జాబితా ఖరారు కాలేదు. మే 4న బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మే 5న బీహార్ కేబినెట్ విస్తరణ ఉండవచ్చని సమాచారం.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default