ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూరు పట్టణంలో పరిశుభ్రతకు కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఆదివారం స్వయంగా రంగంలోకి దిగారు. చెత్త సేకరణ పనులను పర్యవేక్షించడంతో పాటు సిబ్బందితో కలిసి చెత్తను మున్సిపల్ ట్రాక్టర్లలో ఎక్కించారు. చెత్త సేకరణ పనులను పర్యవేక్షించడంతో పాటు సిబ్బందితో కలిసి చెత్తను మున్సిపల్ ట్రాక్టర్లలో ఎక్కించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా వెంటనే తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణ స్వచ్ఛతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడానికి వెనుకాడబోమని కమిషనర్ స్పష్టం చేశారు. శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి ప్రాంతంలో సమయానికి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని తెలిపారు.
నందికొట్కూరులో చెత్త వేస్తే జరిమానా : కమిషనర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరిక
April 19, 2026
0
Tags