ఏఐ సాంకేతికతను ఉపయోగించి సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోల వ్యాప్తిని అరికట్టడంలో విఫలమవుతున్న టెక్నాలజీ సంస్థలకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్‌లో డీప్‌ఫేక్ కంటెంట్ కారణంగా వ్యక్తుల గౌరవానికి భంగం కలగడమే కాకుండా, తప్పుదోవ పట్టించే సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మెటా ఇండియా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), రెడిట్, స్క్రిబ్డ్ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి కంటెంట్‌ను అడ్డుకోవడంలో బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని కోర్టు ఈ సంస్థలను ఆదేశించింది. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన, అసభ్యకరమైన, కృత్రిమంగా సృష్టించిన తప్పుడు కంటెంట్‌ను తక్షణమే గుర్తించి తొలగించడానికి కఠినమైన విధానాలను రూపొందించాలని సూచించింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో, సామాన్యుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఈ సంస్థలపై ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది.
సోషల్ మీడియా దిగ్గజాలకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ
April 15, 2026
0
Tags