బీహార్‌లో రోడ్డుపై కూర్చొని పరీక్ష రాసిన విద్యార్థులు : ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌ నిర్వాకం

Telugu Lo Computer
0


బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమ విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. అయితే, ఆ సెంటర్‌లో విద్యార్థులకు సరిపడా గదులు, ఇతర కనీస సదుపాయాలు లేకపోవడంతో నిర్వాహకులు వారిని బయటకు పంపించారు. దీంతో చేసేదేం లేక విద్యార్థులు రోడ్డు పక్కనే కూర్చొని, వాహనాల రాకపోకల మధ్యే తమ పేపర్లను పూర్తి చేశారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. కొందరు విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని రాస్తుంటే, మరికొందరు నిలబడి గోడకు పేపర్లు ఆనించి రాస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా ఉంటే విద్యార్థులు ఇలాంటి సదుపాయాలు లేని కోచింగ్ సెంటర్లను ఎందుకు ఆశ్రయిస్తారని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సౌకర్యాలు లేకపోయినా చదువుకోవాలనే కసితో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో బీహార్‌ విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి ప్రపంచానికి ఎత్తిచూపింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default