రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం : డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా ముగింపు సమావేశం వికారాబాద్‌లోని హరిత రిసార్ట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘటన సృజన్ అభియాన్ అనే నామకరణం చేశారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదని అన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆదివారం కూడా తాను కోర్టుకు వెళ్లి వచ్చానని తెలిపారు. ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులు చూశానని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించానని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. ఈ క్రమంలో తనపై అనేక కేసులు పెట్టారని, పరువు నష్టం దావాలు కూడా వేశారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశం కోసం, తమ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఐదేళ్లు చేసిన పోరాటాల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా అయ్యారన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ కౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. పది రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మాణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. సంఘటన్ సృజన్ ప్రోగ్రాం ఛైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం సమర్థవంతంగా నిర్వహించబడింది. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా అండ్ మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహ రచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణ అందించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో శిక్షణా శిబిరం ముగిసింది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default