కూకట్‌పల్లి లేక్‌ షేర్‌ మాల్‌లో ప్రమాదం : హోర్డింగ్‌లు, యాడ్‌ బోర్డులు పడి పలువురికి గాయాలు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్‌ షేర్‌ మాల్‌లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్‌లు, యాడ్‌ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్‌లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. హోర్డింగ్‌లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default