ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సబ్యుడు నకుల్ సహా మొత్తం11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, మరో ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరంతా ఒక ఏకే-47 రైఫిల్, ఒక ఇన్‌సాస్, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో డీసీఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇతనిపై రూ. 22 లక్షల రివార్డు ఉంది. ఈ మావోయిస్టు బృందం బసధారా-ఘుమ్షార్-నాగాబలి డివిజన్ పరిధిలో పనిచేస్తూ కలహాండి, రాయగడ, కంధమాల్ జిల్లాల్లో చురుకుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నకుల్ మహారాష్ట్రకు చెందినవాడు కాగా, మిగతా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
ఒడిశా డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు
March 15, 2026
0
Tags