Ad Code

ప్రేమికులను హత్య చేసిన యువతి కుటుంబీకులు


గుజరాత్‌లోలని రాజ్‌కోట్ జిల్లా ఖత్రానా పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన 19 ఏళ్ల నాతి అలియాస్ సోను రబారీ, 21 ఏళ్ల నవీన్ జీవాభాయ్ రబారీ ఫిబ్రవరి 3న అదృశ్యమయ్యారు. వీరి మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాగా, ఆ యువతీ యువకుడు ప్రేమించుకున్నట్లు పోలీసులకు తెలిసింది. వారి ప్రేమ సంబంధాన్ని యువతి కుటుంబం వ్యతిరేకించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో యవతి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రేమ సంబంధాన్ని ముగించాలని, కలుసుకోవద్దని చెప్పగా వారు అంగీకరించకపోవడంతో ఆ జంటను యువతి కుటుంబం హత్య చేసినట్లు బయటపడింది. మరోవైపు ఫిబ్రవరి 3న యువతి తండ్రి, మేనల్లుడు కలిసి నాతి, నవీన్‌ను ఖంభాలా గ్రామానికి బైకులపై తీసుకెళ్లినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అక్కడున్న యువతి తల్లి, సోదరుడితో కలిసి వారిద్దరి గొంతునొక్కి హత్య చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత సమీపంలోని బావిలో వారి మృతదేహాలను పడేశారని అన్నారు. అయితే ప్రేమ జంట అదృశ్యమైన నెల రోజుల తర్వాత వారి హత్య గురించి యువతి తండ్రి ఒప్పుకున్నాడని పోలీస్‌ అధికారి తెలిపారు. దీంతో అగ్నిమాపక దళం సహాయంతో ఆ బావి నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. నాతి, నవీన్‌ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించడంతోపాటు ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరించినట్లు వివరించారు. నిందితులైన యువతి తల్లిదండ్రులు, మేనల్లుడు, మైనర్‌ అయిన సోదరుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu